స్థానిక పత్రికల సమస్య పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి 

విశాఖపట్నం, అక్షరవిజన్ న్యూస్-:  ఆగస్టు3. స్థానిక పత్రికల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ గట్టిగా కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ఏపీ ఎన్జీవోల సంఘం కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా చిన్న, మధ్య, మరియు పీరియాడికల్స్ సంపాదకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ స్థానిక పత్రికలకు అక్రిడేషన్లు, ప్రకటనలు, న్యూస్ ప్రింట్ వంటి సమస్యలు పరిష్కారానికి పాటుపడతామని రాష్ట్ర స్థాయిలో గట్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. చిన్న, మధ్య మరియు పీడియాడికల్స్ సంపాదకులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులకు లోనైతే వారి తరపున 1250 రూపాయలు మెడిక్లెయిమ్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పత్రికల సంపాదకుల సమస్యలను తనవిగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ స్థానిక పత్రికల సంపాదకుల అసోసియేషన్కు కొత్త కార్యవర్గం ఒకటి రెండు రోజులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్య తమవిగా భావించి వాటిని పరిష్కరించేందుకు పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ కార్యదర్శి జి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి రవికుమార్, పి.ఎస్. ప్రసాద్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ. సాంబశివరావు ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్ ఇతర ప్రతినిధులు బండారు శివప్రసాద్, ఎన్.రామకృష్ణ గొడబ రాంబాబు, పక్కి వేణుగోపాల్, చింతా ప్రభాకరరావు, సురేష్ పట్నాయక్, నగేష్,కృష్ణమూర్తి నాయుడు కె కృష్ణపాత్రో, కిషోర్, నర్సింగరావు, సత్యనారాయణ, మళ్ళ దేవ త్రినాథ్, నెలరాజు నర్సింగరావు, శేషు తదితరులు పాల్గొన్నారు. పలువురు సంపాదకులు తమ తమ అభిప్రాయాలను ఈ సందర్బంగా తెలియజేసారు.

 బ్యూరో చీఫ్:- డి ఎస్ ఎన్

Comments