జనసేన పార్టీ సభ్యత్వ నమోదు
అక్షరవిజన్ న్యూస్, విశాఖపట్నం, భీమిలి :- భీమినిపట్నం నియోజకవర్గ ఎండడా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల 4వ విడత సభ్యత్వం నామెదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమినిపట్నం జనసేన ఇంచార్జి సందీప్ పంచకర్ల మాట్లాడుతూ, జనసేన క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక బీమా కాదు పవన్ కళ్యాన్ ఒక కుటుంబానికి భరోసాగా నేనున్నానని తెలిపే సందేశం అని అన్నారు. జనసేన క్రియాశీల సభ్యత్వం అధికారం రాకముందు నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించబడింది అని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రియాశీల సభ్యత్వం పొందాలి అని చెప్పారు. ఈ క్రియశీల సభ్యత్వం పొందడం వల్ల ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది అని వివరించారు. ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైతే ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం 50 వేల రూపాయలు క్రియాశీల సభ్యత్వం పొందిన సభ్యులకి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ క్రియాశీలక సభ్యత్వం జులై 18 నుంచి 28 తేదీవరకు అన్ని పట్టణ,గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మా జనసేన కి సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ -: రాజు