ఘనంగా గరే గురునాథ్ జన్మదిన వేడుకలు..

భీమిలి, అక్షర విజన్ న్యూస్ -: భీమిలి  కెవిఆర్ క్యాటరింగ్ అధినేత టిడిపి జిల్లా పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ 37వ జన్మదిన వేడుకలు మంగళవారం నాడు ఆరో వార్డు పరిధిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ముందుగా పిఎం పాలెం ఆర్ హెచ్ కాలనీ సమీపంలో ఆరో వార్డు బిసి సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి గరే గురునాథ్ పాల్గొని అభిమానుల నడుమ కేక్ కటింగ్ సంబరాలు చేపట్టి అనంతరం మహిళలకి చీరలు పంపిణీ చేశారు. అదే విధంగా ముస్లిం కాలనీ, గాయత్రి నగర్,తదితర ప్రాంతాల్లో మహిళకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, యువతకి క్రికెట్ కిట్లును గరే గురునాథ్ చేతుల మీదుగా అందించి ఆయన జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా గరే గురునాథ్ మాట్లాడుతూ అభిమానులు మధ్య ఆరో వార్డులో పలు చోట్ల ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో పాల్గొని పేద ప్రజలకు సహాయపడటం చాలా సంతోషమని, ఈ ఏర్పాట్లు చేసిన ఆరో వార్డు పలు కాలనీల అభిమానులకు ఆయన రుణపడి ఉంటానని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డు మహిళా అధ్యక్షురాలు పెంటకోట బబ్బెలు, కొప్పాక రామకృష్ణ, కొరగంజి సూరిబాబు, కొల్లి బాబ్జి, ఆరో వార్డు మైనార్టీ సెల్ అబ్దుల్ భాష, కంచర్ల ప్రతాప్ రౌతు వెంకటరమణ, మామిడి రమణ, పోతిన రమణ, కురకూరు చిన్న పోతిన నాయుడు, రియాజ్, గండిబోయిన లక్ష్మి, పతివాడ లక్ష్మి, రుక్మిణి, తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్-:  రాజు

Comments