పెన్షన్ పంపిణీ


అక్షరవిజన్ న్యూస్ -:   రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 3000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలు పెంచి తీరుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ పేర్కొన్నారు. పింఛన్ పంపిణీ సందర్భంగా అయన మాట్లాడుతూ చెప్పిన మాట నిలబెట్టుకొని 3000 రూపాయల పెన్షన్ ని 4000 పెంచడమే కాకుండా అదనంగా 1000 రూపాయలు చొప్పున ఏప్రిల్, మే, జూన్ నెలలతో కలిపి 7000 రూపాయలు ను లబ్ధిదారులకు ఆయన సచివాలయం సిబ్బందితో కలసి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేరన్నారు. ఇందులో భాగంగా 45,46,47,48,49 వార్డుల సచివాలయం సిబ్బందితో కలసి గురునాథ్, 6వార్డు బిసి సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ,  వార్డ్ జనసేన అధ్యక్షులు సంతోష నాయుడు, కుప్పక రామకృష్ణ, కొరగంజి సూరిబాబు, కొల్లి బాబ్జి, కొల్లి గోవిందరావు, గండిబోయిన లక్ష్మి,  రుక్మిణి,  పతివాడ లక్ష్మి, వార్డ్ మైనార్టీ సెల్ అబ్దుల్ బాషా తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ -: రాజు

Comments