వడగాల్పులతో జాగ్రత్త


     వడగాల్పులతో జాగ్రత్త


• పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయండి • ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాలకు ఈసీ సూచన

అక్షరవిజన్ న్యూస్ ఢిల్లీ :- ఈ ఏడాది మార్చి- జూన్ మధ్య  వడగాల్పులతో తీవ్రత ఎక్కువగా ఉండనుందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) జారీ చేసిన హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అప్రమత్తమయింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఈసీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు మంగళవారం లేఖలు రాసింది. పోలింగ్ స్టేషన్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ఇతర వసతులకు సంబంధిం చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సీఈసీ కోరింది. పోలిం గ్ కేంద్రాల వద్ద తాగునీరు, సరైన నీడ, మెడికల్ కిట్ వంటివి తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా భవనం లోని గ్రౌండ్ ఫ్లోర్లోనే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలని ఆదేశిం చింది. పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక ప్రవేశాలు, నిష్క్రమణలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. పోలింగ్ స్టేషన్లలో తాగునీటి కోసం కుళాయిని ఏర్పాటు చేయాలని, 'పర్యావరణ అనుకూల'డిస్పోజబుల్ గ్లాసులను అందుబాటులో ఉంచాలని కోరింది. పోలింగ్ సిబ్బం దితోపాటు ఓటర్లకు అవసరమైన పక్షంలో వాడుకునేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం ఉంచాలని తెలిపింది. పోలింగ్ ఏజెంట్లు, సీనియర్ సిటిజన్లు, గర్భిణీలకు సరైన ఫర్నిచర్ ఉండేలా చూసుకోవాలని పేర్కొం ది. పోలింగ్ స్టేషన్లలో స్త్రీ, పురుష ఓటర్లకు తగిన సంఖ్యలో ప్రత్యేక టాయిలెట్లు ఉండాలని ఈసీ ఆదేశించింది. రోజంతా టాయిలెట్లలో పరిశుభ్రత కోసం ఒక ఉద్యోగిని నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

బ్యూరో చీఫ్-: డి ఎస్ ఎన్ మూర్తి

Comments