ఘనంగా పోతిన ప్రసాద్ జన్మదిన వేడుకలు..              

అక్షరవిజన్ న్యూస్ :-   జివిఎంసి ఆరో వార్డు పరిధి పిఎం పాలెం ప్రాంతానికి చెందిన వైసిపి నాయకులు  అనూష క్యాటరింగ్ అధినేత పోతిన ప్రసాద్ జన్మదిన వేడుకలు పిఎం పాలెం సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పి ఎం పాలెం,అర్ హెచ్ కాలనీ,లక్ష్మి వాని పాలెం, బి టూ కాలనీ,గాయత్రి నగర్ ప్రాంతాలకు చెందిన పోతిన ప్రసాద్ అభిమానులు దాదాపు 35 మంది స్వఛ్చంధంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.రక్తదానం చేసిన వారికి లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ సంస్థ నుండి ప్రశంస పత్రాలను పోతిన ప్రసాద్ చేతుల మీదుగా సమర్పించారు.ఈ సందర్భంగా పోతిన ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజు నాడు తన అభిమానులు ఇటువంటి సేవ కార్యక్రమాలు చేపట్టి పలువురుకి సహాయం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఇదే తరహాలో రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరిన్ని చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోతిన ప్రసాద్ అభిమానులు పాల్గొని ఆయనను అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్ :- రాజు

Comments