"శిష్టకరణాల అవగాహన సదస్సు"
అక్షరవిజన్ న్యూస్ , పీఎం పాలెం -: శ్రీహెల్ప్ ఆల్ అసోసియేషన్, శిష్టకరణాల సేవా సంఘం సంయుక్త నిర్వహణ లో బుధవారం వివిధ అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ రెండు సంఘాలకు అధ్యక్షులుగా ఉన్న లయన్ డొంకాడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ఇటీవల దివ్యాంగులకు ప్రధాని మోడీ ఆలోచన మేరకు చేయూత అందించే పథకం పట్ల అవగాహన కల్పించారు.అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం లో లయన్ డొంకాడ అనిల్ కుమార్ మాట్లాడుతూ నిర్దేశించిన క్రీడల్లో ప్రతిభావంతులైన వారు పాల్గోవాలని పిలుపు నిచ్చారు.ఆటల పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి గల వారికి నమోదు ప్రక్రియలో తమ సంఘాల ప్రతినిధులు సహాయకారి గా ఉంటారని తెలిపారు. తమ సంఘాల పరిధి లో మహిళలకు మెహందీ లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు .కంప్యూటర్ కోర్సు ల్లో కూడా ఉచిత శిక్షణ అందించనున్నట్లు వివరించారు. డిసెంబర్ 4నుండి ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం ప్రతినిధులు మండవ కురిటి లక్ష్మి, డొంకాడ వసంత, పొట్నూరు కుశుబు, షేక్ కరంబి, గోదాబ గౌరీ, పి దుర్గా దేవి భవాని, వై భవాని, మేరీ రమ్య, జి జి రామారావు, కె.వి.ఆర్ పట్నాయక్, గండ్రెడ్డి వెంకట శ్రీనివాస్ రావు పట్నాయక్, లోడగల రాఘవ యాదవ్, వై సంతోష్ మరియు సంఘ సభ్యులు తదితురులు పాల్గొన్నారు.
రిపోర్టర్ -: రాజు