ఈట్ రైట్ మిల్లెట్ మేళ
అక్షరవిజన్ న్యూస్, ఉక్కునగరం:- సెక్టర్ 11లో గల సృష్టి వరల్డ్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉక్కు క్లబ్ లో ఏర్పాటు చేసిన కారయక్రమంలో ఫుడ్ సేఫ్టీ , అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఆర్ ఐ ఎన్ ఎల్ ఆధ్వర్యంలో భాగంగా మిల్లెట్స్ యొక్క ప్రయోజనాలు వివరించి , ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టీల్ ప్లాంట్ సి ఎం డి అతుల్ భట్ మాట్లాడుతూ చిరుధాన్యాలు యొక్క ప్రాధాన్యతను, నేటి మానవ జీవన విధానములో వాటి అవసరతను తెలియజేశారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మేఘన కంభం పేర్కుంటూ ఆహార మార్పులు, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు చేస్తున్న కృషిని అభినందనీ యమన్నారు. ఆర్ఎస్ఐఎన్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి పాఠశాల డైరెక్టర్ పి సుశీలారాణి, చీఫ్ ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు, ప్రిన్సిపాల్ చంద్రిక, వైస్ ప్రిన్సిపాల్ సునయన, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లు, పీఈటి లు తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు .
బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎన్.