..భారతీయ సంస్కృతిని పేంపొదించడమే లక్ష్యం..
సృష్టి వరల్డ్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మేఘన కంభం
అక్షరవిజన్ న్యూస్, వుక్కునగరం:- సృష్టి వరల్డ్ స్కూల్ భారతీయ సంస్కృతిని మరియు సృజనాత్మకతను పెంపొందిస్తూ జాతీయ ఫ్యాషన్ దినోత్సవాన్ని జరుపుకుంది. పాఠశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయ దుస్తులను ధరించి, తమ ఫ్యాషన్ నైపుణ్యాన్ని సగర్వంగా ప్రదర్శించడంతో పాఠశాల ఆవరణలో సందడి నెలకొని చుపరులును ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాల్గొన్న స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మేఘన కంభం మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో జాప్యం ఎదుర్కొంటున్న పిల్లలకు సాయం చేయడానికి సకాలంలో మద్దతు, శాస్త్రీయ విధానాన్ని అందించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల చీఫ్ ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు, ప్రిన్సిపాల్ ఈ. చంద్రిక, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్ధుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
బ్యూరో చీఫ్:- డి ఎస్ ఎన్.