"వసుధైవ కుటుంబం కొరకు యోగా..
అక్షరవిజన్ న్యూస్, ఉక్కునగరం -: సృష్టి వరల్డ్ స్కూల్ లో యోగ దినోత్సవ వేడుకలు 2023. ఘనంగా నిర్వహించారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పాఠశాల ఆవరణంలో. "వసుధైవ కుటుంబం కొరకు యోగా " అనే నినాదం తో నిర్వహించిన ఈకార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంయుక్తగా యోగా దినోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి.సుశీలారాణి, మాట్లాడుతూ యోగ ముఖ్య లక్ష్యం సమగ్ర స్వభావం గురించి అవగాహన పెంచడానికి మరియు వ్యాప్తి చేయడానికి, ప్రతి ఒక్కరికీ దీనిని ఒక సాధారణ దినచర్య లో భాగంగా ప్రచారం చేయడానికి పాఠశాల యాజమాన్యం ప్రారంభించింది అని తెలిపారు. తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఒక సెషన్ ఏర్పాటు చేసి, అనుభవజ్ఞులైన అభ్యాసకులుచే శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో వంద మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొన్నట్లు వివరించారు. ఈ యోగా అన్ని వయసుల వారికి ఫిట్‌నెస్ స్థాయిలకు ఉపయోగపడే అనేక రకాల యోగాసనాలు మరియు టెక్నిక్‌లను కలిగి ఉన్నాయి అని అన్నారు. ఇందులో భాగంగా స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వివిధ యోగాసనాలను చేసి, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చేత చేయించారు. అకడమిక్ కోఆర్డినేటర్ డి.కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఆసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి వివరించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇ. చంద్రిక హాజరై, అధ్యక్షత వహించి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో యోగా యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు.చీఫ్ ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి మాట్లాడుతూ..ఆందోళన,నిరాశ మరియు మొత్తం మానసిక శ్రేయస్సుపై దాని సానుకూల ప్రభావాలను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సునయన, కోఆర్డినేటర్లు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ పి.సుశీలారాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మేఘనా కంభం ఈ విశిష్ట యోగా కార్యకలాపంలో పాల్గొన్న తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు.
బ్యూరో చీఫ్-: డి ఎస్ ఎన్.