ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యం.....

                     సృష్టి వరల్డ్ స్కూల్‌ ప్రిన్సిపల్ -: కె శ్రీధర్ బాబు

అక్షరవిజన్ న్యూస్ -: ఉక్కునగరంలో 'ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టండి' అనే అంశంపై ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సృష్టి వరల్డ్ స్కూల్‌ ప్రాంగణమంతా పచ్చదనం మరియు ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమములో ప్రిన్సిపల్ కె శ్రీధర్ బాబు మాట్లాడుతూ మా విద్యార్థులు పర్యావరణ సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నామని అన్నారు . NCC క్యాడెట్‌లు మరియు ఉపాధ్యాయులు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో సహకరించడానికి ఐక్యంగా ఉన్నారు అని పేర్కొన్నారు. ఎన్‌సిసి క్యాడెట్‌లు మరియు  ఆకుపచ్చరంగు దుస్తులు ధరించిన ఉపాధ్యాయులు పాల్గొని మొక్కలు నాటేరు. ఈ యొక్క కార్యక్రమములో వారిచే మొక్కలు ను సంరక్షిస్తామని  ప్రతిజ్ఞ చేయించారు.

చీఫ్ రిపోర్టర్:- ఎస్ .రాంప్రసాద్ 

Comments