సామాన్య భక్తులకు పెద్ద పీట









సామాన్య భక్తులకు పెద్ద పీట
           ఇఓ.   వి.త్రినాథ్ రావు

          
  సింహాచలం, అక్షరవిజన్ న్యూస్-:  ఈ సారి సింహాద్రి అప్పన్న చందనోత్సవం దర్శన భాగ్యాన్ని సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. శుక్రవారము సింహాచలం దేవస్థానం కార్యాలయంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, విశాఖ జిల్లాలో వివిధ శాఖాధిపతుల తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న జరగబోయే చందనోత్సవం నిర్వహణపై పోలీసు,రెవెన్యూ,మెడికల్ అండ్ హెల్త్,జి.వి.ఏం.సి., అర్ టి సి .ఇలా అన్ని శాఖల వారు పలు సూచనలు చేశారు.ఈ సారి చందనోత్సవం కి లక్ష కు పైగా భక్తులు వొచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన మంచినీరు,చలువ పందిళ్ళు,మజ్జిగ,చిన్నపిల్లలకు పాలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్, అధికారులు తెలిపారు.ఇక స్వామివారి ప్రసాదానికి సంబంధించి లక్షకు పైగా లడ్డూలు సిద్దం చెయ్యడం జరుగుతుందన్నారు.అదేవిధంగా సింహగిరి పైన,క్రిందన కూడా భక్తుల అవసరం దృష్ట్యా 6 కు పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అని పేర్కొన్నారు.ఇక వెహికల్ పార్కింగ్ కు సంబంధించి పాత గోశాల దగ్గర,ఇటు అడవివరం దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేరు. ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరారు.ఆరోజు జరిగే దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు,రూ.300,వి.ఐ.పి.రూ.1000, ప్రోటోకాల్ వి.ఐ.పి.రూ1500 పెడుతున్నట్లు వివరించారు.భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల సహకారాలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ సుజాత, ధర్మకర్త మండల సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు, ఏసీబీ లాండ్ ఆర్డర్ ఏ. నరసింహమూర్తి ,ట్రాఫిక్ ఏసిపి భీమారావు, జీవీఎంసీ వేపగుంట కమిషనర్ మల్లునాయుడు,ఏపీ ఈపీడీసీఎల్ డిఈ రామ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.                                                      

బ్యూరో చీఫ్:- డీ ఎస్ ఎన్ మూర్తి.                                                                                                      



Comments