కేంద్రీయ విద్యాలయం లో ప్రేవేశాలు.
విశాఖపట్నం అక్షరవిజన్ న్యూస్ :- నగరంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటవ తరగతికి ఆన్లైన్ లో ప్రవేశాలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ కమల్జిత్ శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు . దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 17వ తేది వరకు మాత్రమే గడువు ఉందని చేప్పారు. రెండవ తరగతిలో చేరేందుకు కొన్ని సీట్లు అందుబాటులో తెలిపారు. ఇందుకుగాను ఏప్రిల్ 3వ తేది నుండి 12వ తేది వరకు స్కూల్ వద్ద దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు తగిన దృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
బ్యూరో చీఫ్:- డీ ఎస్ ఎన్ మూర్తి.