JSAAP వాల్మీకి భార్గవ్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ

 

JSAAP వాల్మీకి భార్గవ్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ.




విశాఖపట్నం , అక్షరవిజన్ న్యూస్-: పెందుర్తి జర్నలిస్టుల ఆధ్వర్యంలో  గత రెండు రోజులుగా  నిర్వహించిన జేసాప్  వాల్మీకి భార్గవ్ మెమోరియల్  క్రికెట్  పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క పోటీల్లో ప్రథమ, ద్వితీయ  గెలిచిన క్రీడాకారులకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు విజేతలుకు టోర్నీ కప్పుని  అందజేసి సన్మానించారు.  ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలలో  పరవాడకు చెందిన జేసాప్ టీమ్ ప్రథమ బహుమతి ని పొందారు. ద్వితీయ శ్రేణిలో నిలిచిన వెబ్ వారియర్స్ జర్నలిస్ట్లు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

రిపోర్టర్-: రాజు

Comments