చిరస్మరణీయురాలు మదర్ థెరీసా

అక్షరవిజన్ న్యూస్ విశాఖపట్నం :- చిరస్మరణీయురాలు మదర్ థెరీసా  🌻 ఎలయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ వారి ఆధ్వర్యంలో పాపా హోమ్ ప్రాంగణంలో మదర్ థెరీసా జయంతి ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాపహోం అధ్యక్షులు డి సూర్య ప్రకాశరావు ముందుగా మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఆర్తులకు అభాగ్యులకు మానవత్వంతో సేవ చేసిన మదర్ థెరీసా  చిరస్మరణీ యురాలని పేర్కొన్నారు  .  తన యావత్ జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఘనత ఒక్క మదర్ థెరిసాకే దక్కుతుందన్నారు  .  కార్యక్రమంలో ఎలయన్స్ నార్త్ఈస్ట్ అధ్యక్షులు ఎస్ సోమరాజు , కార్యదర్శి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వీ రాజశేఖర్ ,   పాపహోం కార్యదర్శి  టి హేమ చందర్  ,  కోశాధికారి రమేష్ చంద్ జైన్  తదితరులు పాల్గొన్నారు  🙏

Comments