కెసిఆర్ పతనం ప్రారంభం.. డీకే అరుణ ఫైర్

 అక్షరవిజన్ న్యూస్.. హైదరాబాద్..కేసీఆర్ పతనం ప్రారంభం.. డీకే అరుణ ఫైర్...

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన బీజేపీ, మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. నీ ప్రశ్నలకు సమాధానాలు చేప్పే అవసరం ప్రధానికి లేదని ఆమె వ్యాఖ్యానించారు. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, దాని నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసమే కేసీఆర్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని డీకే అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆమె ఫైర్ అయ్యారు. 

జోగులాంబ అమ్మవారిపై వ్యంగ్యంగా మాట్లాడిన కేసీఆర్ పతనం ప్రారంభమైందని డీకే అరుణ దుయ్యబట్టారు. హిందూ దేవతలపై కేసీఆర్ అహంకారపు మాటలా? అని ఆమె విమర్శించారు. ప్రధాని మోడీ తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ భద్రకాళి, జోగులాంబ అమ్మవారిని స్మరిస్తే.. దానిని కేసీఆర్ అవహేళన చేయడం ఏంటని అని ఆరోపించారు. పదే పదే హిందూ జీవన విధానాన్ని అవమానించేలా మాట్లాడటం, దేవతా మూర్తుల పేర్లను అవహేళన చేయడమేనా కేసీఆర్ నైజం అని డీకే అరుణ ప్రశ్నించారు.

Comments