జడ్చర్ల కోర్టు నూతన భవనం నిర్మాణం..

అక్షరవిజన్ న్యూస్.. జడ్చర్ల..  తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం.  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

జడ్చర్ల కోర్టు కు నూతన భవనం.బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞత సన్మానం. ఎల్లపుడు అడ్వొకేట్లకు అండగా ఉంటా... వారి సంక్షేమనికి కృషి చేస్తా.

జడ్చర్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని కలసిన న్యాయవాదులు. 

జడ్చర్ల కోర్టు నూతన భవనం నిర్మాణం కోసం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 1.18 ఎకరాల స్థలం, కోర్టు నిర్మాణానికి రూ.2.00 కోట్లు మంజూరు చేయించిన సందర్భంగా బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అడ్వొకేట్ల పాత్ర చాలా కీలకమైందని కొనియాడారు. అడ్వొకేట్లకు అండగా ఉంటామని తెలుపుతూ వారి సంక్షేమనికి కృషి చేస్తామని తెలిపారు. కొత్త జిల్లాల ప్రామాణికంగా కోర్టుల పునర్విభజన లో బాగంగా జడ్చర్ల JCJ కోర్టు పరిధిలోకి కొత్తగా జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలాన్ని కలపటం జరిగిందని తెలిపారు. అనంతరం 2022-23 సంవత్సర కాలానికి న్యాయవాదుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ కార్డులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందచేశారు.

Comments