అక్షరవిజన్ న్యూస్.. తెలంగాణ.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవీస్ వెల్లడించారు. ఈ ముఠా సభ్యులతో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న 16 మందిని గుర్తించి, వారిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రగ్స్ దందా సరఫరాదారులతో పాటు వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.తమిళనాడు అన్నానగర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద బెంగళూరు వాసి పట్టా జోసెఫ్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఆ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలమణి కంఠ, సమంతరావు, సాయి రాఘవ, అఖిల్ కుమార్‌ల నుంచి వచ్చే వాట్సాప్ మేసేజ్‌లతో డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటాడు పట్టా జోసెఫ్. ఈ ముఠా సభ్యుల నుంచి 35 గ్రాముల ఎండీఎంఏ, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్క గ్రాము ఎండీఎంఏను రూ. 7 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
డ్రగ్స్ దందా..