వికృత భర్త...

అక్షరవిజన్ న్యూస్.. కాకినాడ జిల్లా..  బెడ్ రూమ్ సన్నివేశాలను వీడియో తీయాలని పట్టుబట్టాడు ఓ భర్త.. సంప్రదాయ పద్ధతుల్లో పెరిగిన భార్య అందుకు ససేమిరా అంది. అయినా.. చెప్పిన పని చేయాల్సిందేనని పట్టుబట్టాడు.. తన భార్యతో కలిసి నాలుగు గోడల మధ్య సాగించే కాపురాన్ని వీడియో తీసేందుకు సిద్ధమయ్యాడు. నిర్ఘాంతపోయిన భార్య ఇదేంటని ప్రశ్నిస్తే.. తీసి తీరాల్సిందేనంటూ వేధించడం మొదలు పెట్టాడు.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువతికి.. కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు సైతం అందజేశారు. బంధు మిత్రుల నడుమ వైభవంగా పెళ్లి చేశారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. మంచి అల్లుడు దొరికాడని అమ్మాయి తరపువారు సంతోషపడేంతలోనే.. కొత్త జంట కాపురంలో కలతలు మొదలయ్యాయి.పద్ధతిగా పెరిగిన ఏ యువతి అయినా.. తన తనువు, మనసుతో పాటు సర్వస్వం భర్తకే అర్పించాలని కోరుకుంటుంది. ఇక్కడా అదే జరిగింది. కానీ.. ఆ కార్యాన్ని వీడియో తీయాలని పట్టుబట్టాడు భర్త. ఈ దారుణమైన కోరిక తెలిసి నిశ్చేష్టురాలైంది భార్య. ఇదేం పద్ధతి అని నిలదీసినా.. మొండికేశాడు తప్ప, ఆమె ఆవేదన అర్థం చేసుకోలేదు. బెడ్ రూమ్ వీడియో కావాల్సిందేనని వేధించడం మొదలు పెట్టాడు.ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. జీవితాంతం తోడుగా ఉంటాడని.. కష్టసుఖాల్లో అండగా ఉంటాడని నమ్మిన వాడు.. ఇలా వేధిస్తుండడంతో రోధించింది. ఇంట్లో వాళ్లకు చెప్పలేక తనలో తానే కుమిలిపోయింది. అయినా.. అతని మనసు కరగలేదు. సభ్యసమాజంలో ఏ భార్య కూడా వినకూడని మాట అది. చేయకూడని పని అది. అయినా.. చేయాల్సిన దుస్థితిలోకి నెట్టేయబడింది. ఈ మనోవేదతో తీవ్రంగా కుంగిపోయిన బాధితురాలు.. ఎదురు తిరిగింది. ఈ వికృతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. భర్త అరాచకాలను వివరిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకూ రాకుండా తగిన బుద్ధి చెప్పాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Comments