అక్షరవిజన్ న్యూస్..విశాఖపట్నం.. భారత్ వికాస్ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం అక్కయ్యపాలెం వాగ్దేవి స్కూల్లో భారత్ వికాస్ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా భారత్ వికాస్ పరిషత్ ప్రాంత అధ్యక్షులు వంకాయల సన్యాసిరాజు హాజరయ్యారు సమస్త వ్యవస్థాపక దినోత్సవాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించిన అనంతరం ఆయన సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి దేశభక్తిని పెంపొందించడానికి భారత్ వికాస్ పరిషత్తు భారత దేశ స్థాయిలో చక్కని సేవలు నిర్వహిస్తుందని తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ జాతీయ స్థాయి ప్రతినిధి రమేష్ చంద్ జైన్ మాట్లాడుతూ భారతదేశంలో విద్యార్థుల కోసం దేశభక్తి సంస్థగా ఏర్పాటై సేవా కార్యక్రమాలతో విరాజిల్లుతున్న భారత్ వికాస్ పరిషత్ సంస్థను ఏర్పాటు చేసిన డాక్టర్ సూరజ్ ప్రకాష్ చిరస్మరణీయులని అన్నారు కార్యక్రమంలో దక్షిణ ప్రాంత ప్రతినిధి ఎం వివి సత్యనారాయణ రాష్ట్ర సంస్కార్ ప్రముక్ ఆధ్యాత్మికవేత్త ఎమ్ వి రాజశేఖర్ సంస్థ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు కార్యదర్శి ఎస్ సోమరాజు బివిపి మహిళా విభాగం కార్యదర్శి ఎంఎస్ఎల్ శైలజ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం సేవా కార్యక్రమంగా నిరుపేదలకు నిత్యవసరాలు బియ్యం అందజేయడం జరిగింది.
బివిపి వ్యవస్థాపక దినోత్సవం..