అక్షరవిజన్ న్యూస్.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 27,249 శాంపిల్స్ పరీక్షించగా, 562 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 329 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 616 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.తెలంగాణలో ఇప్పటిదాకా 8,07,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,97,911 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,112 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది కన్నుమూశారు.
కరోనా వ్యాప్తి...