అక్షరవిజన్ న్యూస్.. ఆధ్యాత్మికం... విశాఖపట్నం.. శేషపాన్పు అవతారంలో శ్రీ జగన్నాథ స్వామి 🌻 దేవాదాయ ధర్మాదాయశాఖ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణ అధికారిణి ఎస్ ప్రసన్న లక్ష్మి సారాజ్యంలో టర్నల్ చౌట్రిలో దశావతార మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు శ్రీ స్వామివారు శేషు పాన్పు అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం సన్నిధిలో గల సాంస్కృతిక వేదికపై శ్రీ శ్రీ మ్యూజిక్ అకాడమీ బాల లీలా మహోత్సవం మరియు ప్రసాద్ బృందంచే నిర్వహించిన భక్తి సంగీతం అందరినీ అలరించింది ఆలయ ఈవో ఎస్ ప్రసన్న లక్ష్మి తన ప్రసంగంతో శ్రీకృష్ణ అవతార విశేషాలను తెలిపారు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ వ్యవహరించగా కూచిపూడి చందన పి జగన్నాథచార్యులు అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు నేడు తిరుగు రథయాత్రతో దశావతార మహోత్సవాలు ముగిస్తున్నాయి
శ్రీ జగన్నాథ రథయాత్ర తిరుగు ప్రయాణం...